కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని అంబేద్కర్ కోర్టు చౌరస్తాలో ఓ షో రూం ప్రారంభోత్సవానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. నిరంతరం విమర్శలు చేసుకుంటూ ఉండే ఈ నేతలు.. పూర్తి భిన్నంగా పరస్పరం ఛలోక్తులు విసురుకుంటూ నవ్వులు పూయించారు. పార్టీల సిద్దాంతాలు.. రాజకీయాలు వేరైనా.. స్నేహం గొప్పదని పొన్నం, గంగుల చాటుకున్నారని అక్కడికి వచ్చినవారు చెప్పుకున్నారు. ఇదొక అరుదైన దృశ్యమని పేర్కొన్నారు. సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ ఛైర్మన్ సత్తు మల్లేష్ కూడా పాల్గొన్నారు.
Read Also: మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Follow Us On: X(Twitter)

