Mobile Popup Ad
Mobile Popup Ad

కేరళ నిధులు దోచుకున్న లెఫ్ట్ పార్టీలు: మోదీ

కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) రాష్ట్రంలో వామపక్షాలు దోపిడీకి పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విమర్శించారు. పాలక్కాడ్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వామపక్షాలపై మండిపడ్డారు. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ రెండు కూటములు ఓటు బ్యాంక్ మీదే దృష్టి పెట్టాయని.. రాష్ట్రాభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎన్డీయే (NDA) ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు.

బీజేపీ అంటే భయం

బీజేపీ అంటే కేరళ రాష్ట్రంలోని రెండు కూటములకు భయమని మోదీ (Modi) వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కేరళలో మాత్రం వారితో విబేధిస్తున్నదని ఫైర్ అయ్యారు. అవినీతి పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే కేరళ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అవినీతి చేయడం, దోచుకోవడం, ఓటు బ్యాంకును పదిలపరుచుకోవడం ఇవే వామపక్షాల లక్ష్యమని పేర్కొన్నారు.

Read Also: పొరపాటున అకౌంట్లోకి రూ. 10 కోట్లు జమ.. మహిళ ఏం చేసిందంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>