Mobile Popup Ad
Mobile Popup Ad

యాదాద్రిలో హైటెన్షన్.. కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి (Yadadri) జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. రాజపేట మండలం చల్లూరు గ్రామంలోని విలువైన ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమంగా కబ్జా చేశారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికార బలంతో ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుంటున్నారని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలు గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల ఆంక్షల మధ్యే బీఆర్ఎస్ ముఖ్య నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చల్లూరులో జరిగిన భూకబ్జాపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు కోరారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికార్డులను పరిశీలించాలన్నారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని, అధికార పార్టీ ముసుగులో జరుగుతున్న భూ అక్రమాలపై బాధ్యులందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా (Yadadri) కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Read Also: కేసీఆర్ పర్యటనలో కలకలం.. గాలిలోనే హెలికాప్టర్ చక్కర్లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>