కేసీఆర్ పర్యటనలో కలకలం.. గాలిలోనే హెలికాప్టర్ చక్కర్లు!

కలం వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)  జగిత్యాల పర్యటనలో తీవ్ర కలకలం నెలకొంది. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు వచ్చిన కేసీఆర్.. మరికొద్ది క్షణాల్లో హెలిప్యాడ్‌పై ల్యాండ్ కాబోతుండగా.. అనుమానాస్పద డ్రోన్ ఎగురుతూ కనిపించింది. పైలట్లు అప్రమత్తం కావడంతో.. కాసేపు హెలికాప్టర్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు.. డ్రోన్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ డ్రోన్ ఎవరిది.. ఉద్దేశ పూర్వకంగానే ఎగురవేశారా? లేదా దీని వెనుక మరేమైనా కారణాలున్నాయా? అని బీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్ హెలిప్యాడ్ నుంచి కేసీఆర్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మరికాసేపట్లో, సభా స్థలానికి చేరుకోబోతున్నారు.

Read Also: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి: జీవన్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>