Mobile Popup Ad
Mobile Popup Ad

గడ్డపోతారంలో ఫార్మాలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన కార్మికులు

కలం, మెదక్ బ్యూరో: పారిశ్రామిక కంపెనీల్లో తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అటు యాజమాన్యం, ఇటు అధికార వర్గం చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదాల కారణంగా కార్మికులు చనిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈరి త్రో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం కార‌ణంగా పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా వ్యాపించాయి. పేలుడు జ‌ర‌గ‌డంతో కార్మికులు భయంతో బయటికి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. అగ్ని ప్రమాద (Fire Accident) ఘటనపై స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ప్రమాదం కార‌ణంగా అస్తి న‌ష్టంపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read Also: న్యాయం చేయండి.. విజ్ఞాన్ స్కూల్ ముందు తల్లిదండ్రుల ధర్నా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>