మోదీ, పినరయి విజయన్ ఒక్కటే: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi), పినరయి విజయన్ (Pinarayi Vijayan) కు తేడా ఏమి లేదని , కేరళంలో సమస్యలకు వారిద్దరే కారణమని మండిపడ్డారు. కేరళం ప్రజలు తెలివైన వారు, చదువుకున్న వారన్న సీఎం రేవంత్ రెడ్డి.. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని కితాబిచ్చారు. అయితే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును పినరయి విజయన్‍కు ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తూ కేరళంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకూడదని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణను తమ అధినేత్రి సోనియా గాంధీ దత్తత తీసుకోవడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోగలుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ ఆశీర్వాదం వల్లే తాము ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని వెల్లడించారు. కేరళం ప్రజలకు కూడా ప్రస్తుతం సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని చెప్పారు. కేరళంను అభివృద్ధి చేసే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Read Also: కర్ణాటకలో బస్సు భీభత్సం.. రెండేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>