కలం, వెబ్ డెస్క్ : మొబైల్ ఫోన్ ఈ పేరు చెబితే పిల్లల్లో ఎక్కడా లేని సంతోషం ఆవహిస్తుంది. తినాలన్నా.. ఏడుపు ఆపాలన్నా.. ఏ పని చేయాలన్నా పిల్లలకు ఫోన్ ఇస్తే అయిపోతుంది. కానీ, దీని వల్ల భవిష్యత్తులో జరిగే దుష్పరిణామాలు అనేకం ఉన్నాయి. చాలా మంది ఫోన్లకు అడిక్ట్ (Mobile Addiction) అయి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. పిల్లల్లో అయితే ఇది మరీ ఘోరం. ఈ క్రమంలో ఓ 15 ఏళ్ల బాలుడు మొబైల్ కు బానిస అయిపోయాడు. రాత్రంతా ఫోన్లు చూడడం, సోషల్ మీడియా వాడడం.. పగలంతా నిద్రపోవడమే ఆ బాలుడి దినచర్యగా మారింది. ఫోన్ వాడడం ఆపాలని చెప్పిన తల్లిదండ్రులపై బాలుడు దూషణలకు, దాడులకు పాల్పడ్డాడు. దీంతో విసుగు చెందిన పేరేంట్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఘటన ఏలూరు (Eluru) లో చోటు చేసుకుంది.
ఏలూరుకు (Eluru) చెందిన ఓ బాలుడు సోషల్ మీడియాకు బానిసయ్యి పాఠశాలకు వెళ్లకుండా చదువును నిర్లక్ష్యం చేశాడు. తన కొడుకు జీవితం నాశనమవుతుందని గ్రహించిన తల్లిదండ్రులు మంగళవారం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు బాలుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలుడిలో మొబైల్ అడిక్షన్ (Mobile Addiction) లక్షణాలు కనిపించడంతో పాటు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని డీ– అడిక్షన్ సెంటర్ చేర్చి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
Follow Us On: Instagram

