ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయనే..!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రత్యేక సూచన మేరకే రాష్ట్రపతి ఈ రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణతో ఖాళీ అయిన కీలకమైన విద్యాశాఖ బాధ్యతలను మరొక సీనియర్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు.

దీంతో ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి తాత్కాలికంగా అదనంగా కేంద్ర విద్యాశాఖను అప్పజెప్పారు. కాగా, నీట్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>