కలం, వెబ్ డెస్క్ : ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. 17 జూలై 1941 లో జన్మించిన భారతీరాజా (Bharathiraja) 1977లో వచ్చిన 16 వయదనీలే అనే చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అలాగే, కొత్త జీవితాలు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన భారతీరాజా సీతాకోక చిలుక, జమదగ్ని, కొత్త జీవితాలు, ఆరాధన చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్లాసిక్ గా నిలిచిన సీతాకోక చిలుక సినిమాకు నంది అవార్డు వరించింది. చిత్ర పరిశ్రమకు భారతీరాజా చేసిన విశేష కృషికి గానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీరాజా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

