56 అంగుళాల ఛాతీ యువత ముందు తలొగ్గింది : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : విద్యార్థులు, యువత పోరాటం వల్లే 56 ఇంచుల ప్రధాని తలొగ్గాడని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వ‌ర‌కు జరిగిన “క్యాండిల్ లైట్ ర్యాలీ” లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వంపై సాధించిన విజయంతో జెన్ జీలో దరహాసం కనిపిస్తోందన్నారు. ఉద్యమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని సీఎం కొనియాడారు. విద్యార్థుల పోరాటం వల్లే ప్రధాని మోదీ దిగివచ్చి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించారని చెప్పారు.

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాతో పాటు, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. అలాగే, సోమవారం నాటికి విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డెడ్ లైన్ విధించారు. ఈ విజయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోదల్చుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>