సొంతపార్టీపై నిప్పులు చెరిగిన రాములమ్మ

కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) సొంత పార్టీపై నిప్పులు చెరిగారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. సోమవారం ఆమె శాసనమండలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీ ఏమైంది?’ అంటూ రాములమ్మ ప్రశ్నించారు.

హామీలు ఎందుకు నెరవేర్చలేదు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయిందని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారన్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని విజయశాంతి (Vijayashanti) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సొంతపార్టీ నేతలే ప్రతిపక్షంగా మారిపోయారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని.. కేవలం మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే నిధులు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. సహజంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో అయితే అసంతృప్తిని వ్యక్తపరిచే అవకాశమే ఉండదు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నారు. నేరుగా అసెంబ్లీలోనే సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సొంత పార్టీ సభ్యుల నుంచి వచ్చిన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందా? లేదంటే వారిని పిలిచి మాట్లాడుతుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: 30 మంది మావోయిస్టు అగ్రనేతలు ఎన్ కౌంటర్​..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>