కలం, నల్లగొండ బ్యూరో : ఏప్రిల్ 4వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (MGU Mega Job Mela) పోస్టర్‌ను వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (Khaja Althaf Hussain) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా. హరీష్ కుమార్ వివరాల ప్రకారం, ఈ జాబ్ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన దాదాపు 1500 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పాలిటెక్నిక్ డిప్లమా, ఇంజనీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీకాం, బీఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ఈ జాబ్ మేళాకు (MGU Job Mela) అర్హులు. పోస్టర్‌లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం 7095922360, 9989260671, 9502771776, 9642676777, 9704810880 నంబర్లను సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవి, ఇంజనీరింగ్ డీన్ ఆచార్య రేఖ, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్, డాక్టర్ నీలకంఠం శేఖర్, నాగరాజు, సత్యనారాయణ రెడ్డి, వెంకట్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: సొంతపార్టీపై నిప్పులు చెరిగిన రాములమ్మ
Follow Us On : WhatsApp

