Mobile Popup Ad
Mobile Popup Ad

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్

కలం, వెబ్ డెస్క్ : డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడైన  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu)కి బిగ్ షాక్ తగిలింది. సాక్ష్యులను బెదిరించిన కేసులో అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు రాజమండ్రి స్పెషల్ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

గతంలో సంచలనం సృష్టించిన తన మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రమణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. కేసులోని నలుగురు ముఖ్య సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా తీవ్రంగా బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని అనంతబాబు బెదిరిస్తున్నాడని బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఆయన్ని ఏప్రిల్ 24న అరెస్ట్ చేశారు. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>