కలం, వెబ్‌డెస్క్: తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు (MLC Anantha Babu)కు రాజమండ్రి ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో అనంతబాబుకు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. అనంతబాబు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన కేసును నేడు కోర్టు విచారించింది. ఆయన బెయిల్‌పై ఉంటూ సాక్ష్యులను బెదిరింపులకు గురి చేస్తున్నారని కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో సాక్షులను బెదిరిస్తే ఊరుకునేది లేదని అనంతబాబుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 20 నుంచి ఈ కేసు విచారణ చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ వేగంగా సాగుతోంది.
డ్రైవర్ హత్యకు సంబంధించి అనంతబాబు సాక్షులను బెదిరిస్తున్నారన్న కేసులో ఏప్రిల్ 24న సర్పవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో అనంతబాబు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డ్రైవర్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండనున్నారు.

