ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం జోరు.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ :  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం దేశీయ తయారీ రంగంలో వేగంగా ఎదుగుతోందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లు, ఎయిర్ కండిషనర్‌లు, బైక్‌లు, ఆటోమొబైల్ ఉత్పత్తులు వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచే తయారవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అమలు విధానం, బలమైన తయారీ వ్యవస్థతో ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ దేశవ్యాప్తంగా నాణ్యతకు, విశ్వసనీయతకు ప్రతీకగా మారుతోందని అన్నారు. పెట్టుబడిదారులు, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన లోకేశ్, ‘మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్.. మేక్ ఫర్ ది వరల్డ్’ అనే విజన్‌తో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>