Mobile Popup Ad
Mobile Popup Ad

పార్టీలకతీతంగా తాండా అభివృద్ధి.. ఎమ్మెల్యే యెన్నం హామీ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పార్టీలకతీతంగా వెంకటమ్మ కుంట తాండా అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) తెలిపారు. ఆదివారం హన్వాడ మండలం వెంకటమ్మ కుంట తాండాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో (DK Aruna) కలిసి ఆయన ప్రారంభించారు.

అనంతరం రూ.10 లక్షల వ్యయంతో MGNREGS నిధుల ద్వారా నిర్మించనున్న స్వయం సహాయక సంఘాల (SHG) ఫెడరేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Yennam Srinivas Reddy) మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, సర్పంచ్ ఎం. విజయ వెంకట్ బొట్టు నాయక్, నాయకులు తులసిరాం నాయక్, జర్పుల పరమేష్, సీతారామ్ నాయక్, లింగం నాయక్, తిరుపతయ్య, వెంకటయ్య, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>