కలం, స్పోర్ట్స్: అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన ప్రసిద్ధ్ కృష్ణపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ (Sunil Gavaskar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ప్రదర్శన అతడి అంతర్జాతీయ కెరీర్‌లో కీలక మలుపుగా మారొచ్చని అభిప్రాయపడ్డాడు. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ధ్ 9 ఓవర్లలో 23 పరుగులకే 5 వికెట్లు తీసి అఫ్గానిస్తాన్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. అతడి ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వన్డేల్లో ప్రసిద్ధ్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం.
మొదటి వన్డేలో వికెట్లు తీయలేకపోయిన ప్రసిద్ధ్ (Prasidh Krishna), రెండో మ్యాచ్‌కు దూరమైనప్పటికీ మూడో వన్డేలో కొత్త బంతితో దూకుడుగా బౌలింగ్ చేశాడని గవాస్కర్ (Sunil Gavaskar) పేర్కొన్నాడు. గతంలో షార్ట్ లెంగ్త్ బంతులు వేస్తూ పరుగులు సమర్పించుకున్న అతడు, ఇప్పుడు ఫుల్ లెంగ్త్‌తో స్వింగ్ సాధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడని వివరించాడు. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీతో పోరాడినా, మళ్లీ దాడికి దిగిన ప్రసిద్ధ్ అతడిని ఔట్ చేసి తన ఐదు వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. అనంతరం యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీ, రోహిత్ శర్మ అర్ధశతకంతో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!
Follow Us On: Instagram

