Mobile Popup Ad
Mobile Popup Ad

నిరాడంబరతతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం.. వృద్ధులకు ఆత్మీయ ఆతిథ్యం

కలం, నకిరేకల్ : ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ ఆప్యాయతకు, ప్రేమకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) చిరునామాగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన చూపిన మానవత్వం, నిరాడంబరత స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. గురువారం ఉదయం ఎమ్మెల్యేని తమ వ్యక్తిగత పనిమీద కలవడానికి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఇద్దరు వయోవృద్ధులు ఆయన నివాసానికి వచ్చారు. ఉదయాన్నే వచ్చిన ఆ వృద్ధులను చూసిన వెంటనే ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంతో ఆప్యాయంగా పలకరించారు.

“ఇంత ఉదయమే వచ్చారు.. టిఫిన్ చేశారా?” అని వారిని ప్రేమతో అడిగి తెలుసుకున్నారు. వారు ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని తన ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి పిలిచిన ప్రజాప్రతినిధి ఊరుకోకుండా, తానే స్వయంగా వారికి టిఫిన్ వడ్డించి పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. వారు తింటుండగా పక్కనే కూర్చొని వారి యోగక్షేమాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఒక సాధారణ ప్రజాప్రతినిధిలా కాకుండా, ప్రజల అవసరాలు, ఆకలి, సమస్యలను గుర్తించి ఒక కొడుకులా స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం తీరు అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అనే భావనతో వేముల వీరేశం చూపిన ఈ ఆత్మీయత, మానవత్వం పట్ల నియోజకవర్గ ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే నిరాడంబరత, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమాభిమానాలకు ఈ సంఘటనే మరో నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>