భూభారతి ప్రైవేట్ ఆపరేటర్లకు బిగ్ షాక్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

కలం, వలిగొండ: వలిగొండ తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలలో భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) కంప్యూటర్ ఆపరేటర్లుగా ఇకనుండి జూనియర్ అసిస్టెంట్లు కొనసాగనున్నారు. గతంలో భూ రికార్డులలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఆపరేటర్లుగా ఉన్న ప్రైవేటు వ్యక్తులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను భర్తీ చేసేందుకు, వారికి శిక్షణ ఇచ్చేందుకు వివరాలు పంపాలని ప్రభుత్వం తహశీల్దార్లకు, ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ఏండ్లుగా తమను ప్రభుత్వాలు ఉపయోగించుకొని తొలగించడం సరైనది కాదని, తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>