మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కలం, నల్లగొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) లోని పలు విభాగాలలో పీహెచ్‌డీ (PhD) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024–2025, 2025–2026 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఈ పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేటగిరీ-1, కేటగిరీ-2 విధానాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.

వివిధ విభాగాల్లో కెమిస్ట్రీ 31, బిజినెస్ మేనేజ్‌మెంట్ 18, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ 13, మ్యాథమెటిక్స్ 8, ఎకనామిక్స్ 6, బయో కెమిస్ట్రీ 5, ఇంగ్లీష్ 2, కామర్స్ 1 ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు విధానం, నిబంధనలు, ఫీజు, ఇతర పూర్తి సమాచారం కోసం ఎంజీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>