కలం, నకిరేకల్: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా రామన్నపేట (Ramannapeta) మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారునికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
దళారుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి నిధులు జమ చేస్తున్నట్లు ఆయన (Vemula Veeresham) పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టిందని ఆందోళన చెందే పరిస్థితి లేకుండా వారి పెళ్లి భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, PACS చైర్మన్, మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Follow Us On: X(Twitter)

