రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

కలం, నకిరేకల్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) సూచించారు. బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని కట్టంగూర్, నకిరేకల్, కేతపల్లి మండలాల రెవెన్యూ, సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు సమయానికి డబ్బులు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>