కలం, వెబ్ డెస్క్: భారత్.. భగభగ మండిపోతున్నది. దేశవ్యాప్తంగా ఎండ దంచికొడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 20 హాటెస్ట్ సిటీల్లో (Hottest Cities) 19 ఇండియాలోనే ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12:21 గంటలకు వరల్డ్ వైడ్‌గా నమోదైన ఉష్ణోగ్రతలను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సంస్థ పరిశీలించింది. ఆ డేటా ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే ఉన్నట్టు గుర్తించింది. మిగతా ఒక్కటి నేపాల్‌లో ఉన్నట్టు తెలిపింది. భారత్‌లో బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని నగరాల్లో 43 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. హాటెస్ట్ సిటీల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 8, బిహార్‌లో 7, ఒడిశాలో 2, ఉత్తరప్రదేశ్‌లో 2 ఉన్నాయి.
వాతావరణంలో మార్పులు..
ఏప్రిల్‌లోనే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. ‘‘నార్త్, సెంట్రల్ ఇండియాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఇది కేవలం ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన హీట్ వేవ్ కాదు. దేశవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు సంకేతం” అని హెచ్చరిస్తున్నారు.
ఇవీ కారణాలు..
సూర్యరశ్మి: నార్త్, సెంట్రల్ ఇండియాలో ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుతోంది. దీనివల్ల ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.
మంచు తగ్గడం: హిమాలయాలు, యురేషియా ప్రాంతాల్లో ఈ ఏడాది శీతాకాలంలో మంచు కురవడం తగ్గింది. సాధారణంగా మంచు సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది. కానీ మంచు లేకపోవడం వల్ల భారత ఉపఖండంపై వేడి ఎక్కువగా కేంద్రీకృతమవుతోంది.
సముద్ర మట్టాల్లో మార్పులు: పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, ‘ఎల్ నినో’ పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల వాతావరణ ప్రసరణ వ్యవస్థ దెబ్బతింది. ఇది చల్లటి గాలుల ప్రభావాన్ని తగ్గించి, భూభాగంపై వేడి పెరగడానికి కారణమవుతోంది.
పొడి గాలుల ప్రభావం: వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలులు మేఘాల ఏర్పాటును అడ్డుకుంటున్నాయి. దీనివల్ల వర్షాలు కురిసే అవకాశం తగ్గి, వేడి మరింత తీవ్రమవుతోంది.
వరల్డ్ వైడ్ టాప్ 20 హాటెస్ట్ సిటీలివీ (Hottest Cities)..
సిటీ టెంపరేచర్
1. భగల్‌పూర్, బిహార్ 44°C
2. తాల్చేర్, ఒడిశా 44°C
3. అసన్సోల్, పశ్చిమ బెంగాల్ 44°C
4. బెగుసరాయ్, బిహార్ 43°C
5. మోతీహరి, బిహార్ 43°C
6. ముంగేర్, బిహార్ 43°C
7. భోజ్‌పూర్, బిహార్ 43°C
8. సీవాన్, బిహార్ 43°C
9. బెట్టియా, బిహార్ 43°C
10. బలాంగీర్, ఒడిశా 43°C
11. దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్ 43°C
12. పశ్చిమ మేదినీపూర్, పశ్చిమ బెంగాల్ 43°C
13. లుంబినీ సంస్కృతిక్ (నేపాల్) 43°C
14. బీర్భూమ్, పశ్చిమ బెంగాల్ 43°C
15. గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ 43°C
16. కుల్టీ, పశ్చిమ బెంగాల్ 43°C
17. బంకురా, పశ్చిమ బెంగాల్ 43°C
18. వారణాసి, ఉత్తరప్రదేశ్ 43°C
19. రాణిగంజ్, పశ్చిమ బెంగాల్ 43°C
20. దలూర్బండ్, పశ్చిమ బెంగాల్ 43°C
Read Also: కాలం కన్నా ముందు పుట్టిన పురాతన అడవులు.. మనం కూడా చూడొచ్చు..
Follow Us On: Instagram

