రైతులతో కలిసి ఎమ్మెల్యే సునీత రాస్తారోకో

క‌లం, మెద‌క్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమయ్యిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (MLA Sunitha Laxma Reddy) విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు కల్లాల్లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని మెదక్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి ఆమె రాస్తారోకో నిర్వ‌హించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు.

అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే వడ్లు కొనాలని ధర్నాలు చేస్తున్నారంటే ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాలని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారుల‌తో సక్రమంగా ప‌నిచేయించుకోలేకపొవ‌డం వల్లే ధాన్యం కొనుగోలులో స‌మ‌స్య తలెత్తిందని మండిపడ్డారు. తక్షణమే ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వడ్లు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే (MLA Sunitha) డిమాండ్ చేశారు.

Read Also: రైల్ రోకో కేసులో కవితకు సమన్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>