కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) వద్ద ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam) బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతోపాటు మంత్రుల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ చేసినా స్పందన లేదని, సీఎంకు సైతం 20 సార్లు ఫోన్ చేశానని మండిపడ్డారు. బిల్లులు రాక అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆరోపిస్తూ.. సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కలా అంటూ వ్యాఖ్యానించారు.
తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని పోచారం ఆవేదన చెందారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పారిపోతున్నారన్నారు. ఇరవై ఏండ్లు మంత్రిగా పనిచేసిన తనకు ఎవరైనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి సైతం స్పందించేవాడినని గుర్తుచేశారు. ఇప్పుడు ఉన్న మంత్రులు ఫోన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రూపాయి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక వెళ్లిపోతున్న కాంట్రాక్టర్లను బతిమిలాడి పనులు చేయించుకునే పరిస్థితి నెలకొందన్నారు. నిధుల మంజూరుపై సమయం ఇవ్వండి అని ఉన్నతాధికారులు పోచారంకు సర్దిచెప్పడంతో ఆయన (MLA Pocharam Srinivas Reddy) ఆందోళన విరమించి ఇంటిబాట పట్టారు.
Read Also: ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా పాలన కొనసాగిస్తున్నాం: టీపీసీసీ చీఫ్
Follow Us On: X(Twitter)

