Mobile Popup Ad
Mobile Popup Ad

అందుకే కేసీఆర్‌కు నోటీసులు పంపాను: సీతక్క

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ పదే పదే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. అవాస్తవమైన ఆరోపణలను నేరుగా బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలోనే పోస్ట్ చేశారని పేర్కొన్నారు. ఇందుకు పార్టీ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అందుకే తాను కేసీఆర్‌కే నోటీసులు పంపించినట్టు తెలిపారు. సోమవారం ఆమె ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘అంగన్వాడీ మొబైల్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోంది. తప్పుడు ఆరోపణలు వ్యక్తులు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవి అవాస్తవాలను పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేశారు.

అందుకే నేను బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధినేతగా కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించాను. కేసీఆర్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన పని నాకు లేదు. ఎలాంటి వాస్తవం లేకున్నా.. వారి పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలి. గతంలో ఇలాగే తప్పుడు ఆరోపణలు చేస్తే నేను కేసీఆర్‌కు లీగల్ నోటీస్ పంపించాను. తప్పును 10 సార్లు చెబితే నిజం కాదు. రూ. 44 కోట్ల టెండర్‌లో 30 కోట్ల అవినీతి జరిగిందని హాస్యాస్పదం. అంగన్వాడీ మొబైల్‌ల కొనుగోలు కోసం Tgts ఎక్స్పెక్ట్ కమిటీ ఉంది.. ఆ కమిటీ ప్రకారమే టెండర్ జరిగింది.’ అంటూ సీతక్క (Seethakka) వివరణ ఇచ్చారు.

 Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>