Mobile Popup Ad
Mobile Popup Ad

ఆదోనిలో ఎమ్మెల్యే చేతి దోశకు భలే డిమాండ్.. రూ.700కు అమ్మకం

కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోని (Adoni) పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌లో నిర్వహించిన “ప్రజల కోసం మీ పార్థసారథి” కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి (MLA  Parthasarathi) స్వయంగా పెనంపై దోశ వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా తయారు చేసిన ఆ ప్రత్యేక దోశకు నిర్వాహకులు సరదాగా వేలం పాట (Dosa Auction) నిర్వహించారు.

వేలంలో స్థానిక బీజేపీ మహిళా నాయకురాలు మల్లిక రూ.700కు ఆ దోశను దక్కించుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారు చప్పట్లతో హర్షం వ్యక్తం చేయగా, కార్యక్రమంలో సందడి నెలకొంది. ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే (MLA  Parthasarathi) స్థానికులతో ముచ్చటించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వేసిన దోశ రూ.700కు అమ్ముడవడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>