Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్

కలం, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) హైదరాబాద్ చేరుకున్నారు. తొలిసారి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.రామచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే.అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ పుష్పగుచ్ఛాలు అందించారు. మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.

మరికాసేపట్లో రంగారెడ్డి జిల్లాకు..

సాయంత్రం 4 గంటలకు నితిన్ నబిన్ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచే మరో 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. అనంతరం, నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలపై బూత్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. రాత్రి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరంగల్ వెళ్లనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>