కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ బస్టాండ్ ప్రాంగణంలో “పల్స్ పోలియో” కార్యక్రమాన్ని ఆదివారం నగర పాలక సంస్థ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ (Mayor Mamatha Srinivas), స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏ శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. “రెండు చుక్కల జీవం – పిల్లల జీవితానికి శ్రీరామరక్ష” అని పేర్కొన్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి ఈ ఉచిత పోలియో చుక్కలను వేయించి, మన దేశాన్ని పోలియో రహిత భారతంగా మార్చడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

