జనగామలో కలెక్టర్ పనితీరుపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు

కలం, జనగామ: అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరుకాకపోవడంపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar) అసహనం వ్యక్తం చేశారు. ప్రజా కార్యక్రమాలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పరిపాలన ఒకే అధికారిపై కేంద్రీకృతమవుతోందని ఆయన విమర్శించారు. కలెక్టర్.. వారే అడిషనల్ కలెక్టర్, డీఆర్వో, డీపీఓ అన్నీ కలెక్టరే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కొద్ది రోజులకు డీసీపీ పదవి కూడా వారిదే అవుతుందేమో అంటూ వ్యాఖ్యానించారు.

కలెక్టర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ ప్రజలకు సరైన పాలన అందించడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న క్యాంటీన్ తొలగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలను తొలగించడం సరికాదని అన్నారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా పోలీసు అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. ప్రతి అధికారి రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar) కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>