Mobile Popup Ad
Mobile Popup Ad

పాల్వంచ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుధవారం పాల్వంచ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పీఎస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

పీఎస్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాల్వంచ పీఎస్‌లో సీఐ సతీష్ కుమార్, ఎస్సైలు టీ నాగరాజు జీ విజయ, సిబ్బంది తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>