కలం మెదక్ బ్యూరో: రామచంద్రపురం డివిజన్ పరిధిలో గల BHEL భూములకు సంబంధించి నెలకొన్న వివాదాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని.. కాలయాపన చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురుకోవాల్సి వస్తుందని BHEL యాజమాన్యానికి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సూచించారు. మంగళవారం BHEL ఈడి శ్రీనివాస్, ఏజిఎం సురన్ ప్రసాద్ లతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు.
ప్రధానంగా BHEL పరిశ్రమ భూమిలో ఉందంటూ ఈఎస్ఐ చర్చి సమీపంలో గల బీరప్ప గుడిని సంబంధిత అధికారులు తొలగించడం సరికాదని.. పరిశ్రమ ఏర్పాటు చేయకముందు నుంచే గుడి అక్కడే ఉందని తెలిపారు. వెంటనే అదే స్థలంలో గుడిని పునర్నిర్మాణం చేపట్టకపోతే ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో BHEL యాజమాన్యం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రామచంద్రపురం రాయసముద్రం చెరువు సుందరీకరణ అంశంలో యేళ్లుకు యేళ్లు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్యే (MLA Mahipal Reddy) ప్రశ్నించారు. ప్రజోపయోగ అంశాలలో చెరువు సుందరీకరణ పనులకు విషయంలో ఎన్ని సార్లు చెప్పినప్పటికి సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. సుందరీకరణ పనులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకులు తెలపవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also: కేరళ ఘటన.. ప్రధాని మోదీ దిగ్భాంతి
Follow Us On: Instagram

