రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై హౌస్ క‌మిటీకి బీఆర్ఎస్ డిమాండ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) స‌భ్యులు స‌భ‌లో ఆందోళ‌నకు దిగారు. సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ స‌భ్యుల ఆందోళ‌న‌పై మంత్రి శ్రీధ‌ర్ బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. స‌భ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఇబ్బందులు క‌లిగిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మైనింగ్‌ వ్య‌వ‌హారంపై సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ నేత‌ల వ‌ద్ద ఏవైనా ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వాల‌ని సూచించారు. ఇక సీఐడీ విచార‌ణ కొన‌సాగుతుండ‌గా మ‌ళ్లీ హౌస్ క‌మిటీ ఎందుక‌ని ప్ర‌వ్నించారు. సీఐడీపై న‌మ్మ‌కం లేకుండానే ప‌దేళ్లు ప‌రిపాల‌న చేశారా అని మంత్రి ప్ర‌శ్నించారు. స‌భ‌ను అడ్డుకోవ‌డం స‌రికాద‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>