బండి సంజయ్ తో సీఎం రేవంత్ కుమ్మక్కు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండిసంజయ్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద (MLA KP Vivekananda) ఆరోపించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన (MLA KP Vivekananda) ప్రశ్నించారు.

కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మినిస్ట్రీని దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి బండి భరీరథ్ పై నమోదయిన కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మైనల్ బాలికకు న్యాయం చేయకుండా.. బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ ఎస్ పార్టీ బాధితుల తరఫున పోరాడుతుందని హెచ్చరించారు. తన కొడుకుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేపీ. వివేకానంద డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>