కలం, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆనందంలో ఉన్న ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ (Andy Flower) కు ఐపీఎల్ (IPL) గట్టి షాక్ ఇచ్చింది. అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనకు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. దీంతో గెలుపు సంబరాల్లో ఉన్న ఆర్సీబీ శిబిరంలో ఈ క్రమశిక్షణ చర్య ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన ఈ కీలక పోరులో, రెండో ఇన్నింగ్స్ 17.2 ఓవర్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఆండీ ఫ్లవర్ నాలుగో అంపైర్‌తో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. మ్యాచ్ జరుగుతుండగానే అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ, అసభ్య పదజాలాన్ని ఉపయోగించినట్లు ఐపీఎల్ కమిటీ గుర్తించింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం, మ్యాచ్ సమయంలో అనుచిత వ్యాఖ్యలు లేదా అసభ్య పదజాలం వాడటం నిబంధనలకు విరుద్ధం. ఆండీ ఫ్లవర్ ఈ నిబంధనను అతిక్రమించారని, లెవల్ 1 నేరానికి పాల్పడ్డారని నిర్వాహకులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన ఈ జరిమానాను ఆండీ ఫ్లవర్ అంగీకరించారు. తన తప్పును ఒప్పుకోవడంతో, దీనిపై తదుపరి విచారణ అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

