కలం, వెబ్ డెస్క్: స్పీకర్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ (KP Vivekanand) అన్నారు. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్రంగా స్పందించారు. స్పీకర్ తన విధులు నిర్వహించడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన(KP Vivekanand) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తీర్పు కాపీ ఇవ్వమని అడిగినా సమాధానం లేదని వాపోయారు. కేవలం ఒక పేరా మాత్రమే తమకు ఇచ్చారని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా ఉంటారని మాత్రమే అందులో ఉందని, ఆ ఐదుగురు ఏ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా కొనసాగుతారో స్పీకర్ స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. వ్యవస్థలపై నమ్మకం తగ్గేలా స్పీకర్ నిర్ణయం ఉందని వాపోయారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోయారని ఆరోపించారు.
Read Also: రేవంత్ రెడ్డి మామకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ షాక్
Follow Us On: X(Twitter)


