కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత మామ పద్మారెడ్డి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు నివా బూపా కంపెనీ నో చెప్పింది. పద్మారెడ్డి (Padma Reddy)కి 2024 మే 13న గుండెనొప్పి రావడంతో మెడికవర్ హాస్పిటల్ లో చేరారు. ట్రీట్ మెంట్ కు రూ.23.50 లక్షల దాకా ఖర్చు అయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు అప్లై చేసుకుంటే నివా బూపా కంపెనీ సరైన కారణం చెప్పకుండా రిజెక్ట్ చేసిందన్నారు పద్మారెడ్డి. ఐదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ రూ.20 లక్షల పాలసీ చేయించుకున్నట్టు వివరించారు. మూడేళ్ల వయసు నుంచే పోస్ట్ పోలియో పెరాలసిస్ తో బాధపడుతున్నానని.. పాలసీ తీసుకున్న టైమ్ లో ఇదే విషయం చెబితే ఓకే అన్నారు ఇప్పుడేమో దాన్ని కారణంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీపై ఫిర్యాదు చేశారు.
Read Also: కవిత అరెస్ట్ : నవ్వుకుంటున్న కేటీఆర్, హరీష్
Follow Us On: Sharechat


