బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం మెదక్ బ్యూరో : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రూపి అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy), తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.. మృతురాలు రంగబోయిన భాగ్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) మాట్లాడుతూ, భాగ్య కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కుటుంబానికి ఏ విధమైన కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: ఫుట్‌బోర్డ్ ప్రమాదాలకు గుడ్​బై.. క్లోజ్డ్ డోర్ నాన్ ఏసీ రైలు వచ్చేస్తోంది!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>