అంబేద్కర్ ఆశయ సాధనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. విప్ బీర్ల అయిలయ్య

కలం, యాదగిరిగుట్ట: అంబేద్కర్ (Ambedkar) ఆశయాలకనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, పేదలు, దళితులు, బీసీల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పులామాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రతలో భాగంగా అవగహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.

చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించారన్నారు. భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిదన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని సూచించారు. ప్రతిఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలని ఆయన (Beerla Ilaiah) పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో నవీన్ కుమార్, రూరల్ సీఐ శంకర్ గౌడ్, టౌన్ సీఐ భాస్కర్, ట్రాఫిక్ సీఐ కృష్ణ, బోడ రాధ, మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రాంచందర్ పాల్గొన్నారు.

Read Also: అధికారముంటేనే వెళ్తారా?.. క్రెడిట్ కోసమే అంబేద్కర్ విగ్రహమా?..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>