బాల్క సుమన్‌ అరెస్ట్‌పై హరీశ్ రావు రియాక్షన్.. కాంగ్రెస్‌పై ఫైర్

కలం, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ (Balka Suman)ను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకే సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. క్యాతన్‌పల్లిలో (Kyathanpally Municipality) బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. అధికార, పోలీస్, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన బాల్క సుమన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాగిరి రాజ్యమేలుతోందని, ఇది పార్టీ అరాచక వైఖరికి పరాకాష్ట అని హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లను కిడ్నాప్‌లు చేస్తూ, అడ్డదారుల్లో చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. కాగా తన అరెస్ట్ విషయమై బాల్క సుమన్ (Balka Suman) స్పందించారు. తనను జైలుకు పంపి, క్యాతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని మంత్రి వివేక్ చేసిన కుట్ర ఇది అని బాల్క సుమన్ ఆరోపించారు.

 Read Also: రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో చదరపు గజం రూ.51 వేలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>