కలం, జోగులాంబ గద్వాల: ఎర్రవల్లి (Erravalli) మండలం తహశీల్దార్ ఆఫీస్‌లో భూభారతి ఆపరేటర్ (Bhu Bharathi Operator) గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు(33) ఈనెల 6వ తేదిన విధులు ముగించుకుని స్వగ్రామమైన మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి బైక్ పై బయలుదేరాడు. జాతీయ హైవేపే వాహనాల వేగానికి బైక్ అదుపుతప్పి కిందపడాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాంబాబు హైదరాబాద్ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతునికి భార్య ఉంది. కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భూభారతి ఆపరేటర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 నెలల వేతనాలు రానప్పటికీ తాము విధులు నిర్వర్తిస్తున్నామని భూభారతి ఆపరేటర్లు వాపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి భూభారతి ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అందరినీ కొనసాగించాలని ఆ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి విన్నపించారు.
Also Read : ఇండిగో వెబ్‌సైట్ క్రాష్.. ప్రయాణికులకు సమస్యలు!
Follow Us On: X(Twitter)

