యశ్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

కలం, సినిమా : కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic)  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో (Malla Reddy University) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. “ఇట్స్ టైమ్.. హీ ఈజ్ కమింగ్! హైదరాబాద్ గెట్ ఇంటాక్సికేటెడ్” అంటూ ‘టాక్సిక్’ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో యశ్ అభిమానులలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆసక్తి నెలకొంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి (Toxic) గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 26న ‘టాక్సిక్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. దీనితో హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

Also Read : ప్ర‌భాస్‌కు ట్రీట్మెంట్‌.. ఇన్‌స్టాలో ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ పోస్ట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>