బద్దిపల్లి బ్రహ్మోత్సవ పోస్టర్ ఘన ఆవిష్కరణ

కలం, కరీంనగర్ బ్యూరో : కొత్తపల్లి మండలం బద్దిపల్లి (Baddipalli)  గ్రామంలో నిర్వహించనున్న శ్రీ అలర్ మేల్ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు.

శుక్రవారం రోజున ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఆయన నివాసంలో కలిసి, బ్రహ్మోత్సవాలకు హాజరుకావలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దిపల్లి సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ పోరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలు దాసరి శరత్, కోశాధికారి మిట్ట కమలాకర్, ముఖ్య సలహాదారు ఉప్పు రాజశేఖర్, వైస్ చైర్మన్ తాండ్ర సుధాకర్‌తో పాటు గ్రామస్థులు, పాలకవర్గ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

Read Also: ఇంటర్‌నెట్ షట్ డౌన్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>