కలం, కరీంనగర్ బ్యూరో: 14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్‌పీవీ (HPV Vaccine) వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) పేర్కొన్నారు. శుక్రవారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మనవేణి అంజి యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ అవగాహన పోస్టర్‌ను ఎమ్మెల్యే తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను అంజి యాదవ్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటువంటి సామాజిక హితమైన కార్యక్రమాన్ని చేపట్టిన నటుడు అల్లు అర్జున్‌కు, ఆయన అభిమానులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం, సింగిల్ విండో మాజీ చైర్మన్ సింగిరెడ్డి సోమిరెడ్డి, ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు సల్ల మహేందర్, మిడిదొడ్డి నవీన్ కుమార్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర చంద్రమౌళి, లంక రవి, ఉదయ్, దొగ్గలి అంజి, చందు, రఘు, రంజిత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: హెల్తీ తిరామిసు: స్పెషల్ వీగన్ డెజర్ట్ రెసిపీ
Follow Us On: X(Twitter)

