కలం, వెబ్ డెస్క్: జగన్ పాదయాత్రలు చేసినంత మాత్రాన తాను చేసిన పాపాలు పోవని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి(Budda Rajasekhar Reddy)వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్( YS Jagan) ఎన్ని పాదయాత్రలు చేసినా తన పాపాలు తన వెంటే వస్తాయన్నారు. జగన్ ఏం చేసినా ప్రజలు తనను మళ్లీ నమ్మే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో ఏం తక్కువైందని పాదయాత్ర చేస్తానంటున్నావని ప్రశ్నించారు. కూటమికి ప్రజలు 164 సీట్లు ఇచ్చారంటే అందులో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. వైసీపీ వాళ్లు కూడా ఓటు వేయడం వల్లే కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ దగ్గరికి వచ్చే వాళ్లు లేరని, ఆయనను ఎవరూ పట్టించుకే అవకాశం లేదని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.


