కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు గల్లంతు

కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్​ కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు గల్లంతు అయ్యాయి. స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు బయట ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ లు పట్టుకెళ్తున్న వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో బ్యాలెట్ బాక్సును, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. 47వ డివిజన్ బూత్ నెంబర్ 156 నుండి 10 బ్యాలెట్ బాక్సులు మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు (Rega Kantharao) పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై పోలీసులను నిలదీశారు. ఒక పోలింగ్ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా బాక్సులు ఎక్కడ ఉన్నాయో తేలేదాకా స్టేషన్ నుంచి కదలబోనని స్టేషన్లలో రేగా కాంతారావు బైఠాయించారు. బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెరలేపి ఉంటుందని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి.

Read Also: వాలంటైన్స్​ డే.. లవర్స్​ కనిపిస్తే ఎముకలు విరిచేస్తామంటూ వార్నింగ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>