epaper
Wednesday, February 18, 2026
epaper

వాలంటైన్స్​ డే.. లవర్స్​ కనిపిస్తే ఎముకలు విరిచేస్తామంటూ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్​ : ఫిబ్రవరి నెలా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వాలంటైన్స్​ డే (Valentines Day). ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును ఘనంగా నిర్వహించుకునేందుకు లవర్స్​ రెడీ అవుతున్నారు. అయితే, భారతదేశంలో కొన్ని వర్గాలు వాలంటైన్స్​ డేను వ్యతిరేకిస్తున్నారు. ఇది పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఉందంటూ, భారతీయ ఆచార వ్యవహారాలు, సనాతన దర్మానికి వాలంటైన్స్​ డే జరుపుకోవడం విరుద్దమని కొన్ని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. దీంతో దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోకుండా.. పార్కులు, రెస్టారెంట్ల దగ్గర బజరంగ్​ దళ్(Bajrang Dal)​, విశ్వహిందూ పరిషత్ (VHP)​, హిందూ మహాసభ, ఆర్​ఎస్ఎస్​ (RSS) లాంటి తదితర సంస్థలు దృష్టి పెడుతున్నాయి.

ప్రేమికుల దినోత్సవం (Valentines Day) ముందు ఉత్తరప్రదేశ్​ కు చెందిన క్రాంతిసేన లవర్స్​ కు వార్నింగ్​ ఇస్తోంది. వాలంటైన్స్​ డే జరుపుకోకూడదు అంటూ ముజాఫర్​ నగర్​ లో కరపత్రాలు పంచుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ప్రేమికులు కనిపిస్తే వారి ఎముకలు విరిచేస్తాం అని లాఠీలకు నూనే రాస్తు హెచ్చరించిన క్రాంతి సేన సభ్యులు. ఈ హెచ్చరికల నేపథ్యంలో యూపీలో ప్రేమికుల దినోత్సవరం జరుపుకోవడం కష్టంగా మారిందనే చెప్పాలి.

Read Also: ఆస్తి లాక్కోని అనాథను చేశారు.. కన్నతండ్రిపై కన్నకూతుళ్ల కర్కషత్వం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>