epaper
Wednesday, February 18, 2026
epaper

ఓడియ‌మ్మ బంటి.. మ‌హారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ వ‌ర‌కు టెర్ర‌ర్!

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో జ‌నాన్ని హ‌డ‌లెత్తించిన ఓ ఎలుగుబంటి (Bear) తెలంగాణ‌ (Telangana)లోని ఆదిలాబాద్‌లోకి ప్ర‌వేశించింది. దీన్ని ప‌ట్టుకునేందుకు అట‌వీ శాఖ అధికారులు పెద్ద యుద్ధ‌మే చేశారు. ఎందుకంటే ఇది మామూలు బంటి కాదు. ఏకంగా ఎనిమిది మందిపై దాడి చేసింది. ఈ ఎలుగుబంటి దాడిలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ముందుగా ఈ ఎలుగుబంటి అట‌వీ ప్రాంతం నుంచి జ‌నావాసాల్లోకి ప్ర‌వేశించింది. మ‌హారాష్ట్ర‌లోని ద‌యాల్ ధ‌న్నూర్ గ్రామంలో ఎనిమిది మందిపై దాడి చేసింది. వీరంతా తీవ్ర గాయాల‌పాల‌య్యారు. వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందులూ ఒక‌రు మృతి చెందారు.

ఈ దాడి అనంత‌రం ఎలుగుబంటి మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు దాటి తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌లోకి ప్ర‌వేశించింది. ఎలుగుబంటి వ‌చ్చింద‌న్న స‌మాచారంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ మ‌హారాష్ట్ర అట‌వీ శాఖ అధికారులు దీన్ని ప‌ట్టుకునేందుకు ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఎట్ట‌కేల‌కు గురువారం ఉద‌యం దీన్ని బోనులో బంధించారు.

Read Also: రోవన్ అట్కిన్సన్ సంచలన నిర్ణయం.. 160 మిలియన్ డాలర్ల విరాళం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>