Mirai OTT | యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజ సజ్జ నటించిన తాజాగా సినిమా ‘మిరాయ్’. థియేటర్లలో ఆడియన్స్‌లో అబ్బురపరిచిన ఈ సినిమా.. ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడానికి ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ అయి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన ‘మిరాయ్’.. ఇప్పుడు ఓటీటీని కూడా ఓ ఊపుఊపేయడానికి రెడీ అయింది. జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 10న ‘మిరాయ్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓటీటీలో కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Mirai OTT | మిరాయ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లు సాధించింది. దీంతో ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన క్లబ్‌లో ఎన్‌టీఆర్, ప్రభాస్ సరసన తేజ సజ్జా(Teja Sajja) కూడా నిలిచాడు. దసరా సీజన్‌లో విడుదలైన ఓజీ, కాంతారా-1 సినిమాలు విడుదలైనా ‘మిరాయ్’ తన మార్క్ చూపించుకుంది. బడా స్టార్ల సినిమాలతో పోటీ పడి కలెక్షన్లు రాబట్టింది. అయితే సాధారణంగా మల్టీప్లెక్స్ ఒప్పందాల ప్రకారం హిందీ సినిమాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తాయి. కానీ ‘మిరాయ్’ మాత్రం 40 రోజుల్లోపే ఓటీటీ విడుదలకు రెడీ అయింది.

