నవ వధువు ఆత్మహత్యతో జగిత్యాల(Jagtial) జిల్లా ఇబ్రహీంపట్రం ఎర్దండి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టి ఏడు రోజులు అయ్యాయో లేదో యువతి ఆత్మహత్య చేసుకుంది. జీవితాంతం కలిసి ప్రయాణిద్దాం అనుకున్న వారి ఆశలకు చిన్న గొడవ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ ఘటన ఎర్దిండి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రికి అదే ఊరికి చెందిన అల్లిపు సంతోష్‌ది ప్రేమ వివాహం. వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. జీవితమంతా కలిసి గడపాలనుకున్నారు. అందుకు ఇంట్లో వాళ్లని కూడా ఒప్పించి వారం క్రితం అంటే సెప్టెంబర్ 26న మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు.
నవదంపతులు ఇద్దరూ దసరా పండగ సందర్భంగా గంగోత్రి ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం విషయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. కలగజేసుకున్న పెద్దలు.. ఇద్దరికీ సర్దిచెప్పారు. పెళ్ళంటి ఇవన్నీ కామన్ అని.. సర్దుకుని అర్థం చేసుకుని ముందుకు సాగాలని చెప్పారు. కానీ గంగోత్రి మాత్రం తీవ్ర మనస్థాపానికి గురైంది. దాంతో సంతోష్, గంగోత్రి తిరిగి తమ ఇంటికి వచ్చేశారు. ఏమైందో ఏమోకానీ.. మరుసటి రోజు రాత్రి గంగోత్రి.. ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Jagtial | ఈ విషయం తెలుసుకున్న గంగోత్రి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భార్యభర్త మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? జరిగే ఏ అంశంపై జరిగాయి? ఆ గొడవల కారణంగానే గంగోత్రి.. ఆత్మహత్య చేసుకుందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? అనేది తెలుసుకోవడం కోసం భర్త సంతోష్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Read Also: లిఫ్ట్ ఇచ్చి.. ఆపై మహిళ హత్య

